KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ‘డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గ్రామ సచివాలయం’గా పేరు మార్చాలని కోరుతూ 1వ వార్డు సభ్యుడు కోడం మహిపాల్ కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల, ఉప సర్పంచ్, కార్యదర్శికి ఆయన వినతిని సమర్పించారు.