TPT: చంద్రగిరి నియోజకవర్గం పాకాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైంది. ఎమ్మెల్యే పులివర్తి వెంకటప్రసాద్ ప్రారంభించిన ఈ మేళాలో 276 మంది యువతీ యువకులు పాల్గొనగా 109 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. 26 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. 12 బహుళజాతి కంపెనీలు పాల్గొని సుమారు 900 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచాయి.