JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమన్న ఆలయంలో నాగుపాము కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో నైవేద్యం అనంతరం గర్భగుడి ఎదుట ఉన్న నందీశ్వర స్వామి ప్రక్కన పాము ప్రత్యక్షమవుతున్నట్లు ఆలయ సిబ్బంది గురువారం తెలిపారు. కొంతసేపు అక్కడే ఉండి అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోతున్న పామును భక్తులు దైవ దర్శనంగా భావిస్తూ భక్తి పారవశ్యంతో ఆనందిస్తున్నారు.