ADB: బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బంజారా జాగృతి మండలి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుభాష్ మహారాజ్‌కు ఆయన నియామక పత్రం అందజేశారు. భజన్ మండలి ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావాలని, సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు.