GDWL: మల్డకల్ మండలం నీలిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లు రానివారు ఆందోళన చెందవద్దని, రెండో విడతలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నీలిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.