WNP: ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నర్సింహారెడ్డి అన్నారు. గురువారం చిట్యాల డబుల్ బెడ్ రూమ్ సముదాయం వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ‘అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం అవసరం’ అనే నినాదంతో ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు.