MDK: జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమసింగ్ పిలుపునిచ్చారు. మెదక్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచి డ్రగ్స్ వాడకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఎంహెచ్ డాక్టర్ శ్రీ రామ్, డాక్టర్ శివదయాళ్ తదితరులు పాల్గొన్నారు.