NZB: సిరికొండ మండలం న్యావనందిలో గురువారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం తిరుపతి, ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, విద్యా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని పేర్కొంటూ, విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని కోరారు.