MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ ZPHSలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రత్యేక ప్రవేశాల డ్రైవ్ కొనసాగుతోంది. 6 నుంచి 10 తరగతులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశాలు ఉన్నాయని హెచ్ఎం రవిబాబు తెలిపారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.