కొత్తకోట మండలం కానాయిపల్లి కోటిలింగేశ్వర దేవస్థానంలో మంగళవారం ప్రభాతవేళ ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామివారికి పంచామృతాలు, భస్మగంధం, పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరించి ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.