JN: రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన ఓ మహిళ మగబిడ్డ కోసం పసికందును అపహరించేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఎంసీహెచ్ ఆసుపత్రిలో డైపర్ మార్చే పేరుతో పిల్లల వార్డులోకి వెళ్లిన ఆమె, బాబును తీసుకుని ఆటోలో పరారయ్యేందుకు యత్నించినట్లు ఏసీపీ పండరీ చేతన్ తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటపడి ఆమెను పట్టుకుని బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు.