KMM: జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. రేపు ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.