NTR: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్. అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.