SDPT: డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో బెజ్జంకి వార్డు సభ్యులు లింగాల వెంకటేష్ – భార్గవి దంపతులు తమ కుమార్తె విభాతో కలిసి సేవా కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వృద్ధాశ్రమానికి మూడు కూలర్లు, బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. దీంతో వారిని పలువురు అభినందించారు.