ADB: ఇచ్చోడ మండలంలోని మార్కెట్ యార్డ్లో శనగ కొనుగోళ్లను శనివారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసినట్లు సెంటర్ ఇన్ఛార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం యార్డ్లో శనగ నిల్వలు నిండుకోవడంతో (అధికంగా ఉండటంతో) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని, తదుపరి కొనుగోలు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పటివరకు రైతులు సహకరించాలన్నారు.