NRPT: కృష్ణ మండలంలోని గూడెబల్లూరులో శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ప్రశాంతంగా ముగిసిందని మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సైలు నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో వేడుకను విజయవంతం చేసిన పోలీసులను సీఐ అభినందించారు.