KMR: జుక్కల్ మండలంలోని రైతులు శనగ కొనుగోలు కోసం టోకెన్స్ తీసుకోవాలని ఏవో మహేశ్వరి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్లు అగ్రికల్చర్ ఆఫీస్లో ఇస్తే ఏఈవోలు టోకెన్లు ఇస్తారని చెప్పారు. నేరుగా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లకుండా టోకెన్లు తీసుకుని వెళ్లాలని సూచించారు.