ASF: సిర్పూర్(టి)లో శ్రీ సాయి బాలాజీ రైస్ మిల్లు యజమానులు రూ.6.91 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి, నకిలీ బ్యాంకు గ్యారంటీలతో మోసానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.3.8 కోట్లు అక్రమంగా ఆర్జించిన నలుగురు నిందితులను ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.