JGL: గొల్లపల్లి మండలం భీమరాజు పల్లి గ్రామంలో ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ బుధవారం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి పాల్గొన్నారు.