PDPL: అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో రైతు వెంకట స్వామి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న RIని ACB అధికారులు పట్టుకున్నారు. భూమి ఎంక్వయిరీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన RIకి రూ.10,000 ఇస్తుండగా ACB అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ACB DSP విజయ్ కుమార్ సారథ్యంలో విచారణ జరుపుతున్నారు. అంతర్గం తాహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.