KNR: ఏప్రిల్లో రానున్న బాబు జగజ్జీవన్ రామ్, డా. బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లాలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, దళిత నేతలు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.