NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జల్ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలకు తాగునీటి ప్రాధాన్యం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు, మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు.