WGL: దళిత ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ నేత మాచర్ల ప్రభాకర్ ఖండించారు. మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యత వహించి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటన దళిత సమాజంపై బీజేపీ వైఖరి మరోసారి బయటపెట్టిందని విమర్శించారు.