SRPT: నడిగూడెంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ‘జనగణన-2027’పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి సర్వేలో పాటించాల్సిన నిబంధనలు, డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సర్వేలో సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.