SRCL: సిరిసిల్లలో గంజాయి విక్రేతను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన ఎండీ అహ్మద్ (35) గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సుమారు 200 గ్రాముల గంజాయిని రూ.5 వేలకి కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొంత తను వాడుతూ మరికొంత ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.