ఖమ్మం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్‌ను వ్యాపారాలకు వాడుతున్న హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న 21 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురు హోటల్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా సిలిండర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.