JN: తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎంపీ చామల కిరణ్‌ను బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 26న తరిగొప్పులలో జరగబోయే దుర్గమ్మ ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచ్ మధుసూదన్ ఉన్నారు.