ADB: జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అర్హత గల ప్రతి విలేకరికి కార్డు అందేలా చూడాలని కోరారు.