భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలో పర్యటించిన మంత్రి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.