ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ రహదారి భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద చర్యలు తీసుకోవడం, జాతీయ రహదారులపై ఆక్రమణలను తొలగించాలన్నారు.