TPT: సత్యవేడులోని యువత, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీఐ మురళి బుధవారం పలు కీలక సూచనలు జారీ చేశారు. ఐపీఎల్ నేపథ్యంలో యువత ఆన్లైన్ బెట్టింగ్‌ల వైపు మళ్లుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది యువకులు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఐ తెలిపారు. ఇటువంటి చర్యలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.