KMM: బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో శనివారం ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య యాత్ర నిర్వహించారు. డాక్టర్ GV నేతృత్వంలో పారాక్యట్ నిషేధం గురించి రైతులకు తెలిసేలా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు.