NLG: నందికొండలోని మహాత్మ జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. తమ కళాశాలలో 100% ఫలితాలు రావడంపై సిబ్బంది సంజయ్ సాగర్, శివ, రోహిత్, ఉదయ్ శంకర్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.