NLG: మర్రిగూడలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నిధులతో రూ.1.50 లక్షల విలువైన బోరు మోటార్‌ను మంజూరు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ నాయక్ అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరమల్ల శిరీష, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.