HNK: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.