MDK: తూప్రాన్ మండలం యావాపూర్, దాతర్ పల్లి, నర్సంపల్లి, గుండ్రెడ్డిపల్లి గ్రామాలలో ఇందిరా క్రాంతి పతం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకెపి ఏపిఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.