కామారెడ్డిలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో విద్యార్థులు ప్రదర్శించిన స్క్రిప్ట్‌లు ఆలోచింపజేశాయి. ఓ విద్యార్థి మితిమీరిన వేగంతో తల్లిని కోల్పోయిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. బీబీపేట మండలానికి చెందిన కళావతి తన కుమారుడు హెల్మెట్ లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో మరణించాడని రోదించిన తీరు కలచివేసింది.