సూర్యాపేట పట్టణంలోని 27వ వార్డులో కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ఇవాళ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. పారిశుధ్యంపై ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు.