CTR: అగ్ని ప్రమాదాలు వాటి నివారణ పై ఆ శాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పుంగనూరు పట్టణంలో కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా.. ఒకవేళ ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా తయారు చేయించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.