BDK: చండ్రుగొండ మండలం రేపల్లెవాడ -గానుగపాడు గ్రామల మధ్యలో ఉన్న ఎదుళ్ళ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ సిబ్బందితో కలిసి ఇవాళ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.