MNCL: ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల దీర్ఘకాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం టీజీ జెఎసీ ఆధ్వర్యంలో మంచిర్యాల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు బండి రమేష్ మాట్లాడుతూ.. 2023 జూన్ నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలు, బిల్లులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.