MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గడల రాంచరణ్ హన్మకొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించాడు. దీంతో ప్రతిభ కనబరిచిన రాంచరణ్‌ను కళాశాల బృందం, తల్లిదండ్రులు అభినందించారు.