KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రేపు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రుల సమక్షంలోనే అందజేయాలని సూచించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాలన్నారు. సమావేశ వివరాలను, ఛాయాచిత్రాలను వెంటనే ISMS పోర్టల్లో నమోదు చేయాలని కోరారు.