NRML: జిల్లాలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.