PDPL: రామగుండంలో సీఐటీయూ అనుబంధ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన జరిగింది. ఉత్తరప్రదేశ్, హర్యానాలో కార్మికులపై అణచివేత, సీఐటీయూ నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.