వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న ఉదయం 10:30 గంటలకు ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ సంస్థలో 100 సేల్స్ రెప్రెసెంటేటివ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన 10వ తరగతి లేదా అంతకంటే పైచదువు ఉన్న యువత అర్హులు. ఎంపికైన వారిని నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు.