HNK: హన్మకొండ నగరంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణలపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కఠినంగా స్పందించారు. గురువారం రాత్రి 51వ డివిజన్ పరిధిలో జిల్లా కోర్టు అదాలత్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ మార్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడాయి రెస్టారెంట్ చౌరస్తా వద్ద ఫుట్పాత్లు, మురుగు కాల్వలను ఆక్రమించి నిర్మించిన షెడ్లను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.