BDK: దమ్మపేట మండలంలోని అంకంపాలెంలో ఊకే వినోద్ అనే యువకుడిపై సుమారు 20 కోతులు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తలకు మూడు కుట్లు వేశారు. గ్రామంలో ఏళ్ల తరబడి కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.