డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని ఇక్కడి నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఏదైనా బిల్లు విషయంలో అధికార పార్టీ చెప్పిందే ఎంపీలు చేయాల్సి వస్తుంది. దీంతో సభ్యులు ఎక్కువ ఉన్న ఉత్తరాదికే ఏ పార్టీ అయినా ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. దాని వల్ల అనివార్యంగా దక్షిణాది ప్రయోజనాలకు తూట్లు పడక తప్పదు.