ADB: పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా త్వరగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. ఉట్నూరు ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పాలిసెట్- 2026 గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.